మార్పుకు, మంచికి, మానవతా విలువలకు ప్రజాస్వామ్య పరిరక్షణకు పట్టం కడుతూ, సమాజంలోని రుగ్మతలపై, అసమానతలపై సామాజిక సమరం సాగిస్తున్న పత్రిక మానుకోట.
ప్రపంచ పర్యాటకుడు మార్కోపోలో సందర్శించిన గ్రామం మానుకోట వద్దిరాజు సోదరుల పత్రికా నిర్వాహణ, సంపాదకులు షోయబుల్లా ఖాన్ అమరత్వం, దాశరథి సోదరుల సాయుధ పోరాటం, అచ్చమాంబ వీరోచితం గ్రామ గ్రామాన చైతన్య ధీరోదాత్తులయి అస్తిత్వం కోసం వీరోచితంగా పోరాటాలు సాగించి స్వేచ్ఛా స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగాల వారసత్వాల వునికి పుచ్చుకొని మానుకోట ప్రాశస్థతను ప్రశంసించగ మానుకోట పత్రిక నడక సాగిస్తున్నది.
“ప్రజాస్వాయ్యంలో పత్రికలే నిజమైన ప్రతిపక్షం"